" /> నవ్యాంధ్ర టైమ్స్
Videos Gallery

విడుదలైన వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ కొద్ది గంటలు క్రితం విడుదలైంది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో ప్రముఖ రంగస్థల నటుడు నటిస్తుండగా,లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుంది.నటుడు శ్రీ తేజ్ చంద్రబాబుగా ఈ చిత్రంలో నటిస్తున్నాడు.

కాగా ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల పాత్రలను,మరికొన్ని కీలకపాత్రను చూపించారు.కీరవాణి తమ్ముడు కళ్యాణ్ మాలిక్ సంగీతాన్ని ఈ చిత్రానికి అందిస్తున్నాడు. జీవి ఫిలిమ్స్ పతాకం పై రాకేష్ రెడ్డి ,దీప్తి బాలాగిరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ తో పాటుగా అగస్థ్య మంజు దర్శకత్వం వహిస్తున్నారు.