" /> నవ్యాంధ్ర టైమ్స్
Videos Gallery

ట్రెండ్ అవుతున్న జ్యోతిక - మంచు లక్ష్మి నటిచించిన వీడియో సాంగ్

తమిళ కథానాయకి జ్యోతిక ప్రధాన పాత్రలో తాజాగా నటించిన చిత్రం 'కాట్రిన్‌ మొళి'. హిందీలో విజయం సాధించిన 'తుమ్హారి సులు'కు ఇది తమిళ రీమేక్‌ . జ్యోతిక స్నేహితురాలిగా మంచు లక్ష్మి నటించారు. ఇందులో తమిళ స్టార్ కథానాయకుడు శింబు  అతిథి పాత్రలో మెరవనున్నారు. ఈ చిత్రానికి రాధామోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాట్రిన్‌ మొళి చిత్రాన్నిధనుంజేయన్‌ నిర్మాత కాగా ఎ.ఆర్‌ రెహమాన్‌ సన్నిహితుడూ ఎ.హెచ్‌ కాశిఫ్‌ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఇందులో జ్యోతిక లేట్‌ నైట్‌ ఆర్జే పాత్రలో సందడి చేయనున్నారు. నవంబరు 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకున్న 'జిమిక్కి కమ్మల్‌..'  అనే  పాటను ఈ సినిమాలో ఉంచారు. ఈ పాటకు జ్యోతిక, మంచు లక్ష్మి కలిసి డ్యాన్స్‌ చేశారు. ఈ పాట వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేయగా.. యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తుంది. అయితే  ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో 35వ స్థానంలో ఉంది.  ఈ  పాటను 906,601 మంది వీక్షించగా 23 వేల మందికిపైగా పాట నచ్చిందని లైక్‌ చేశారు.

'తుమ్హారి సులు'లో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ నటించారు. సురేశ్‌ త్రివేణి దర్శకత్వం వహించారు. నేహా ధుపియా ఇందులో విద్యా బాలన్‌ స్నేహితురాలిగా కనిపించారు. 2017 నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం రూ.50 కోట్లకుపైగా వసూలు చేసింది.