" /> నవ్యాంధ్ర టైమ్స్
Videos Gallery

"ద సాంగ్ ఆఫ్ భారత్" వచ్చేసింది..

సూపర్‌స్టార్ మహేశ్ బాబు,..దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రం టైటిల్ సాంగ్‌ను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. "విరచిస్తా నేడే నవశకం...నినదిస్తా నిత్యం జనహితం" అంటూ సాగె ఈపాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలుపెట్టేశారు.అందులో భాగంగానే ఈ రోజు ఈ పాటను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చిన, ఈ పాట రామజోగయ్య శాస్త్రి కాలం నుండి జాలువారింది. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ఏప్రిల్ 20న ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.