" /> నవ్యాంధ్ర టైమ్స్
Videos Gallery

రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్, దర్శక ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రానుందని కొన్ని నెలలుగా వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. ఆ వార్తలకు బలాన్ని చేకూర్చుతూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ రోజు ఆర్ఆర్ఆర్ ప్రకటన పేరిట 23 సెకన్లు ఉన్న ఓ వీడియో విడుదల చేసింది. బాహుబలి తరువాత రాజమౌళి ఎటువంటి చిత్రం తీయనున్నారన్న విషయంపై ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంది.
రామ్‌ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి మల్టీస్టారర్ మూవీ తీయనున్నాడని వార్తలు రావడమే కానీ అధికారికంగా ఈ చిత్రంపై ప్రకటన మాత్రం రాలేదు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ తమ యూట్యూబ్ చానెల్ ఆర్ఆర్ఆర్ (రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు) అంటూ ఈ వీడియో విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ వీడియోపై స్పందించిన రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన.. తన ట్విట్టర్ ఖాతాల్లో దీన్ని పోస్ట్ చేసి 'ఇది ఏమిటి రామ్‌చరణ్?' అని ప్రశ్నించింది.