blog single post
Sports

2018-11-08 07:34:01

చైనా ఓపెన్‌:క్వార్టర్‌ ఫైనల్లో కి సింధు, శ్రీకాంత్‌

భారత స్టార్ షట్లర్లు చైనా ఓపెన్‌లో దూసుకెళ్తున్నారు. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టారు. ఈరోజు జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సింధు 21-12, 21-15తో బుసానన్‌ (థాయిలాండ్‌)పై విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఆట ప్రారంభం నుండే దూకుడుగా ఆడుతూ సింధు రెండు గేమ్‌లను సునాయాసంగా గెలుచుకుంది.
 పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 10-21, 21-9, 21-9తో టామీ సుగియార్టో (ఇండోనేషియా )పై విజయం సాధించి క్వార్టర్స్‌కి చేరుకున్నాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్‌ పుంజుకుని వరుసగా రెండు, మూడు గేమ్‌లను సొంతం చేసుకుని మ్యాచ్ ను కైవసం చేసుకున్నాడు.