blog single post
Sports

2018-11-08 01:18:48

ముంబయి ఇండియన్స్ బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌!

టీమిండియా మాజీ పేసర్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేసే అవకాశం ఉంది. ఆ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న లసిత్‌ మలింగ్‌ స్థానాన్ని జహీర్‌ ఖాన్‌ భర్తీ చేస్తాడని సమాచారం. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి మలింగ ముంబయి ఇండియన్స్‌కే ఆడాడు. గతేడాది నిర్వహించిన వేలంలో అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ముంబయికి బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. గతేడాది అమ్ముడుపోని లసిత్‌ మలింగ వచ్చే సీజన్‌లో వేలంలో పాల్గొనాలని భావిస్తున్నాడు. మళ్లీ ఐపీఎల్‌లో ఆడాలని కోరుకుంటున్నాడు.