blog single post
Sports

2018-11-08 10:26:58

ఒకే మైదానంలో హెరాత్ 100 వికెట్లు

శ్రీలంక లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌ రంగనా హెరాత్‌ గాలె మైదానంలో 100 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్టుల్లో ఈ ఫీట్‌ సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో తొలిటెస్ట్‌ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్‌ రూట్‌ను 17వ ఓవర్‌లో హెరాత్‌ బౌల్డ్‌ చేసి ఈ క్లబ్‌లో చేరాడు. ఇలా ఒకే మైదానంలో 100 వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మురళీధరన్‌(మూడు మైదానాల్లో), ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్‌ ఆండర్సన్(లండన్‌ మైదానం) హెరాత్‌ కంటే ముందున్నారు. ఈ టెస్ట్‌మ్యాచ్‌ అనంతరం హెరాత్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.