blog single post
Sports

2019-04-15 02:34:09

విన్నర్లుగా మొమోట, తైజు!

ప్రపంచ నెంబర్‌వన్‌ క్రీడాకారులు కెంటో మొమోట, తైజు యింగ్‌ సింగపూర్‌ ఓపెన్‌లో చాంపియన్లుగా నిలిచారు. నిన్న నువ్వా నేనా అంటూ సాగిన పురుషుల ఫైనల్లో మొమోట (జపాన్‌) 10-21, 21-19, 21-13 తేడాతో ఏడో సీడ్‌ ఆంటోనీ గిన్‌టింగ్‌ (ఇండోనేసియా)పై గెలిచాడు.మొమోటకు రెండో గేమ్‌లోనూ తీవ్ర పోటీ ఎదురైంది.8-12తో వెనుకబడిన తరుణంలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి ముందుకెళ్లాడు.మహిళల విభాగంలో నెంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) 21-19, 21-15 తేడాతో నొజోమి ఒకుహరా (జపాన్‌)పై పైచేయి సాధించి వరుసగా రెండో టైటిల్‌ అందుకుంది.