blog single post
Sports

2019-03-15 11:45:15

ప్రపంచ టీమ్‌ చెస్‌లో భారత్‌కు 4వ స్థానం

ప్రపంచ టీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు తృటిలో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయింది.కాగా టోర్నీ ప్రారంభం నుండి అద్భుతంగా రాణించిన భారత్ జట్టు  నిన్న 9వ రౌండ్లో 1.5- 2.5 తేడాతో రష్యా చేతిలో పరాజయం పాలైంది.4వ స్థానంలో నిలిచింది.8వ రౌండ్లు ముగిసే సరికి సంయుక్తంగా 2వ స్థానంలో ఉన్న భారత జట్టు ఆఖరి రౌండ్‌ను కనీసం డ్రా చేసుకున్నా కాంస్యం కైవసం చేసుకునేది.కాగా భారత ఆటగాళ్లు అరవింద్‌ చిదంబరం, సూర్యశేఖర గంగూలీ, అదిబన్‌ తమ గేమ్‌లను డ్రా చేసుకోగా, అలెగ్జాండర్‌ చేతిలో ఎస్పీ సేతురామన్‌ పరాజయం పాలయ్యాడు.కాగా ఈ టోర్నీలో రష్యా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.అయితే ఇంగ్లాండ్‌, చైనా వరుసగా 2,3 స్థానాల్లో నిలిచాయి.మహిళల విభాగంలో భారత్‌ 6వ స్థానంతో ఛాంపియన్‌షిప్‌ను ముగించింది. అయితే మహిళల విభాగంలో చైనా, రష్యా, జార్జియా వరుసగా మొదటి మూడు స్థానాలను సొంతం చేసుకున్నాయి.