blog single post
Sports

2019-03-14 03:22:18

ఢిల్లీ క్యాపిటల్స్‌ సలహాదారుగా వ్యవహరించనున్న గంగూలీ

ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సలహాదారుగా టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ  నియమితులయ్యారు. దీనికి సంబంధించి జట్టు యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో పనిచేయనున్నందుకు సంతోషంగా ఉందని వారి క్రీడా ప్రస్థానంలో తాను  కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని గంగూలీ అన్నాడు.అపార అనుభవం ఉన్న గంగూలీ సలహాలు, సూచనలు, జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. ఆయన నాకు కుటుంబ సభ్యుడితో సమానం. గంగూలీ తమ జట్టుకు సలహాదారుగా ఉండడం ఆనందంగా ఉందని’ అని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఛైర్మన్‌ పార్థ్‌ జిందాల్ వ్యాఖ్యానించారు. ఆ జట్టు కోచ్‌ ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి గంగూలీ పనిచేయనున్నారు.మార్చి 24న ముంబై ఇండియన్స్‌తో, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.