blog single post
Sports

2019-03-14 03:15:38

స్విస్ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నుండి వైదొలిగిన సైనానేహ్వాల్

స్విస్ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సత్తా చాటాలని భావించిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు ఊహించని అనుభవం ఎదురైంది.ఆమె అనారోగ్య కారణంతో  టోర్నీ నుండి తప్పుకుంది.ఈ విషయాన్ని సైనానేహ్వాల్ స్వయంగా తెలిపింది.ఈ మేరకు సైనా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.గత సోమవారం నుండి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్ననని ఇటీవల ముగిసిన ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఈ నొప్పితోనే కొన్ని మ్యాచ్‌లాడాను... అయితే ఇప్పుడు ఈ నొప్పి తీవ్రం కావడంతో స్విస్‌ ఓపెన్‌లో పాల్గొనకుండా స్వదేశం వచ్చేశాను.కాగా వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరబోతున్నానని తెలిపింది.అయితే త్వరలోనే కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నా అని సైనా ఆ పోస్టులో  వెల్లడించింది.