blog single post
Sports

2019-02-11 04:19:01

ప్రపంచ కప్ జట్టులో రహానె, విజయ్‌శంకర్‌కు స్థానం లభించే అవకాశం ?

వన్డే ప్రపంచ కప్ టోర్నిలో పాల్గొనే భారత జట్టు ఎంపిక చేసేందుకు ఇటు సెలక్షన్‌ కమిటీ, బీసీసీఐ కసరత్తులు ప్రారంభించాయి.కాగా ఏప్రిల్‌ 23లోపు భారత జట్టును ప్రకటించాల్సి ఉండటంతో సెలక్షన్‌ కమిటీ ఆటగాళ్ల ప్రతిభను జల్లెడ పడుతోంది.ఈ క్రమంలో ప్రపంచకప్‌లో పాల్గొన బోయే భారత జట్టులో అజింక్య రహానె,రిషభ్‌ పంత్‌,విజయ్‌ శంకర్‌లకు స్థానం లభించే అవకాశాలు ఉన్నాయని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.