blog single post
Sports

2019-01-11 04:26:13

ఎం ఎస్ ధోని మా అందరికీ దిక్సూచి :రోహిత్ శర్మ

వచ్చే వన్డే ప్రపంచకప్‌లో ఎం.ఎస్‌ ధోనీ ముఖ్యపాత్ర పోషిస్తాడని భారత జట్టు స్టార్  ఓపెనర్‌ రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు.ప్రస్తుత కాలంలో వెటరన్‌ కీపర్‌ ధోనీ బ్యాటింగ్‌ ఫామ్‌ తరచూ...  వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.కానీ ధోని జట్టులో ఉంటే ఆటగాళ్లకు భరోసాగా ఉంటుందని, మా అందరికీ దిక్సూచిలా ఉపయోగపడతాడని రోహిత్‌ శర్మ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా ధోనీ ప్రభావాన్ని డ్రెస్సింగ్‌ రూమ్‌లో,మైదానంలో చూస్తూనే ఉన్నాం... ధోని వికెట్ల వెనకాల ఉంటే కెప్టెన్‌కు ధైర్యంగా ఉంటుంది అని అభిప్రాయపడ్డాడు.అలానే  ధోనీతో కలిసి ఉంటే యువ ఆటగాళ్లలోనూ పప్రశాంతంగా ఉండటం అలవడుతుంది. ఆటలో ఇది చాలా ముఖ్యం అని చెప్పారు.కాగా భారత జట్టు కెప్టెన్‌గా ధోనీ జట్టును చాలా సంవత్సరాలు ముందుకు నడిపించాడు అని రోహిత్ తెలిపారు.ధోని కెప్టెన్ హోదా నుండి తప్పుకున్నాక కూడా అతని విలువైన సలహాలు భారత జట్టుకు ఉపయోగపడ్డాయి అని అన్నారు.అయితే లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ బలంగా ఉంటుంది అని తెలిపారు.ధోని ఫినిషర్‌గాఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడో మనమంతా చూసిందే అని రోహిత్ గుర్తు చేశాడు. చాహల్‌, కులదీప్ లాంటి యువ బౌలర్లు ఎం.ఎస్ ధోనీ సలహాలతో రాణించారు అని రోహిత్‌ శర్మ తెలిపారు.