blog single post
Sports

2019-01-11 03:37:29

అంతర్జాతీయ బాక్సింగ్‌ అసోసియేషన్‌ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో మేరీ కోమ్

అంతర్జాతీయ బాక్సింగ్‌ అసోసియేషన్‌ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానాన్ని భారత మహిళా బాక్సర్‌ మేరీ కోమ్‌  కైవసం చేసుకుంది.కాగా గత ఏడాది అద్భుత ప్రదర్శన చేసిన మేరీ కోమ్‌ మహిళల 48 కిలోల విభాగంలో మొత్తం 1700 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.కాగా 57 కిలోల విభాగంలో సోనియా లాథర్‌ 2వ ర్యాంక్‌ దక్కించుకుంది.అయితే మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్స్ లో 6 స్వర్ణాలు సాధించి చరిత్ర సృష్టించిన భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ అసోసియేషన్‌ (ఐబా) ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.కాగా గత సంవత్సరం నవంబర్‌లో ఢిల్లీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌ షిప్ లో  48 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచిన మేరీ కోమ్ తాజాగా నిన్న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మొత్తం 1700 పాయుంట్లతో నెంబర్ 1 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.36 సంవత్సరాల మేరీ కోమ్ 2020 ఒలింపిక్స్‌లో 51 కిలోల విభాగంలో పాల్గొనుంది.అయితే 48 కిలోల విభాగాన్ని టోక్యో విశ్వక్రీడల నుండి తప్పించడంతో ఆమె తన విభాగాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.కాగా 2012 లండన్‌ లో జరిగిన ఒలింపిక్స్‌లో మేరీ కోమ్‌ కాంస్య పతకం సాధించింది.3 పిల్లల తల్లయిన మేరీ కోమ్‌ 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌, పోలెండ్‌లో జరిగిన టోర్నీలో స్వర్ణ పతకాలు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.