blog single post
Sports

2019-01-11 01:16:39

మహిళలను కించపరిచే వ్యాఖ్యలను భారత జట్టు సమర్ధించదు:విరాట్ కోహ్లీ

ఆసీస్ తో వన్డే సిరీస్‌ నేపథ్యంలో భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ….భారత జట్టు యువ  ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య మహిళ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పై భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించారు.ఓ టీవీ షోలో రాహుల్‌, హార్దిక్‌ పాండ్య లు మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలని, భారత జట్టుకు వాటితో సంబంధం లేదని వ్యాఖ్యానించారు.భారత క్రికెట్ జట్టు ఇలాంటి వాటికి మద్దతు పలకదు.అయితే బాధ్యత గల ఆటగాళ్లుమైన మేము అటువంటి వ్యాఖ్యలను సమర్థించం అని అన్నారు.  కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యలు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతం.కాగా ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టేవే అని అన్నారు.అవి సరైనవి కావని ఆ ఇద్దరు ఆటగాళ్లు అర్థం చేసుకుంటారు..అని.. కోహ్లీ అన్నారు.పాండ్య,రాహుల్‌ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండే విషయం పై బీసీసీఐ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుందని విరాట్ కోహ్లీ తెలిపారు.కాగా బీసీసీఐ తీసుకోబోయే నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని విరాట్ చెప్పారు. అయితే భారత క్రికెట్‌ జట్టు ఆలోచన, ఆటపై ఇలాంటివి ప్రభావం చూపించబోవని వెల్లడించాడు.ఇటువంటి ఘటనలు  దురదృష్టకరమని కోహ్లీ అన్నారు.