blog single post
Sports

2018-12-06 06:50:32

పుజారా అద్భుత సెంచరీ.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ పుజారా (123; 246 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11).. కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13) త్వరగానే  పెవిలియన్ చేరారు. ఈ సమయంలో రోహిత్ శర్మ(37), రిషబ్ పంత్ (25), అశ్విన్ (25)లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.చివరలో టీమిండియా బ్యాట్స్ మెన్స్ అందరూ పెవిలియన్ చేరినా.. బౌలర్ల అండతో స్కోర్ ను ముందుకు సాగిస్తూ ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.ఆసీస్ బౌలర్లలో  స్టార్క్,హాజెల్ వుడ్,పాట్ కమెన్స్, లియోన్ తలా రెండు వికెట్లు దక్కాయి.