blog single post
Sports

2018-12-06 03:01:35

హాకీ ప్రపంచ కప్: నెదర్లాండ్స్‌ పై జర్మనీ ఘనవిజయం ...మరొక మ్యాచ్ డ్రా ...!

గత ప్రపంచకప్‌ రన్నరప్‌ అయిన నెదర్లాండ్స్‌ జట్టుకు జర్మనీ జట్టు  షాక్‌ ఇచ్చింది. హాకీ వరల్డ్‌కప్‌ పూల్‌-డి లో ఈ రెండు జట్లకు మధ్య  జరిగిన మ్యాచ్‌లో జర్మనీ జట్టు 4-1తో నెదర్లాండ్స్‌ జట్టును చిత్తు ఓడించింది. అయితే ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో జర్మనీ జట్టు  సమష్టి కృషితో రాణించింది.కాగా నెదర్లాండ్స్‌ జట్టు తరఫున వాలెంటైన్‌ వెర్గా ఆట 13వ నిమిషంలో గోల్‌ చేశాడు. జర్మనీ నుండి ముల్లర్‌, లుకాస్‌ విండ్‌ఫెడరర్‌, మార్కో , క్రిస్టోఫర్‌ వరుసగా  గోల్స్‌ చేశారు. మ్యాచ్ తొలి క్వార్టర్‌లో దూకుడుగా కనిపించిన నెదర్లాండ్స్‌ 13వ నిమిషంలో గోల్‌ చేసి ఆధిక్యాన్ని సంపాదించింది. తర్వాత ఆ జట్టు రక్షణాత్మకంగా ఆడతూనే  ప్రత్యర్థి జట్టును  నిలువరించడానికే ప్రయత్నించింది.

ఈ సమయంలో మళ్ళీ  పుంజుకున్న జర్మనీ జట్టు  మ్యాచ్ రెండో క్వార్టర్లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి 1-1తో స్కోరును సమం చేసింది.మ్యాచ్ చివరి క్వార్టర్లో జర్మన్‌ ఆటగాళ్లు తమ ఆటతో ప్రత్యర్థి జట్టు పై చెలరేగి గెలిచారు.పూల్‌-డి లో మరో మ్యాచ్  పాకిస్థాన్‌-మలేసియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది.కాగా చివరి క్వార్టర్లో పాకిస్థాన్‌ నుండి అతిఖ్‌ మహమ్మద్‌ , మలేసియా నుండి ఫైజల్‌ గోల్స్‌ చేశారు.దీనితో మ్యాచ్ డ్రాగా ముగిసింది