blog single post
Sports

2018-12-06 10:44:42

ప్రొ కబడ్డీ:ఢిల్లీ,హర్యానా జట్లు గెలుపు

ప్రొ కబడ్డీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 32-31 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. దీంతో ఆ జట్టు వరుసగా మూడో గెలుపును నమోదు చేసుకున్నట్లయ్యింది. అంతకుముందు జరిగిన తొలిమ్యాచ్‌లో హర్యానా జట్టు 35-33 పాయింట్ల తేడాతో బెంగాల్‌ వారియన్స్‌పై గెలిచింది. స్టీలర్స్‌లో గోయల్‌, బెంగాల్‌లో మణిందర్‌ సింగ్‌లు రైడ్‌లలో రాణించారు. రైడ్‌లలో బెంగాల్‌ 24 పాయింట్లు, ట్యాకిల్స్‌లో స్టీలర్స్‌ 10 పాయింట్లు సాధించాయి. ఇరుజట్లు రెండేసిసార్లు ఆలౌట్‌కూడా అయ్యాయి. ఈరోజు యుపి యోధ- హర్యానా స్టీలర్స్‌, దబాంగ్‌ ఢిల్లీ- తమిళ్‌ తలైవాస్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.