blog single post
GENERAL NEWS

2019-04-15 03:35:06

వచ్చే నెల ప్రారంభం కానున్న హ్యాపీనెస్ట్‌-2 బుకింగ్

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రజా నివాసార్థం ఏపీసీఆర్డీయే ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్‌-2 ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ బుకింగ్‌లు వచ్చే నెలలో మరోసారి మొదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం.నిజానికి ఈ ప్రక్రియను మార్చి, ఏప్రిల్‌లలోనే నిర్వహించాలని సీఆర్డీఏ అధికారులు మొదట భావించినప్పటికీ అవసరమైన అనుమతులు పొందాల్సి ఉండటం వలన,రాష్ట్రంలో ఎన్నికల హడావిడి నేపథ్యంలో ఈ బుకింగ్ ప్రక్రియ  ఆలస్యమైనట్లు తెలుస్తోంది. హ్యాపీనెస్ట్‌-2 అనుమతులన్నీ త్వరలో లభించనుండటం, పోలింగ్‌ కూడా ముగియడంతో సాధ్యమైనంత త్వరగా బుకింగ్‌లు జరిపేందుకు అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. రాజధాని గ్రామాల్లో ఒక గ్రామమైన ఐనవోలు వద్ద ఈ ప్రాజెక్ట్‌ రానున్నట్లు సమాచారం.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విజయవాడలో నిర్వహించిన హ్యాపీసిటీస్‌ సదస్సులో ఈ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనప్రాయంగా శంకుస్థాపన జరిపిన విషయం తెలిసిందే.