blog single post
GENERAL NEWS

2019-04-15 03:13:38

ఈ నెల 15 నుండి 22 వరకు దుర్గామల్లేశ్వర స్వామి వార్ల కల్యాణ బ్రహ్మోత్సవాలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15 నుండి 22 వరకు దుర్గామల్లేశ్వర స్వామి వార్ల కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. మల్లికార్జున మహా మండపంలో నిన్న ఆమె విలేకరులతో మాట్లాడారు. భద్రాచలంలో లాగానే భక్త బృందాలు చేతులతో వడ్లగింజల పొట్టు తీసిన బియ్యాన్ని తలంబ్రాలుగా ఉపయోగిస్తామని, దేవాలయ భూముల్లో పండిన ధాన్యాన్నే ఈకార్యక్రమానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు.