blog single post
GENERAL NEWS

2019-04-15 01:12:34

ఆంధ్రప్రదేశ్ కు 1309 కోట్ల నాబార్డ్ ఋణం!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు నుండి రూ.2100 కోట్ల రుణాలు అందనున్నాయి. ఆర్‌ఐడీఎఫ్ కోసం రూ.1309 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం కోసం అదనంగా మరో రూ.239.62 కోట్లు కేటాయించినట్టు తెలిపింది.2018-19 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌ కోసం రూ.1070 కోట్ల రుణం కేటాయించారు.కానీ, రూ.1243.84 కోట్లు రుణాలు ఇచ్చారు. లాంగ్‌టర్మ్‌ ఇరిగేషన్‌ ఫండ్‌ కింద అధిక నిధులు తెచ్చుకునేందుకు మార్చి 15న ఏపీ ప్రభుత్వం అనుబంధ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది.దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల లభ్యత మరింత పెరుగుతుందని, అందుకు అనుగుణంగా చిన్న తరహా నీటి పారుదల కింద సాగయ్యే భూమి విస్తీర్ణం పెంచుకునేలా అనువైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్రానికి నాబార్డు సూచించింది.