blog single post
GENERAL NEWS

2019-03-15 12:25:48

ఈనెల 30న ‘అమరావతి ఐటీ ఫెస్ట్‌'

‘అమరావతి ఐటీ ఫెస్ట్‌’ను విజయవాడలో  ఘనంగా నిర్వహించనున్నారు. ఏపీఎన్నార్టీ, ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ, ఎపిటా తదితర సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈనెల 30న ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు రాజధానికి వచ్చిన 94ఐటీ కంపెనీలు, వాటిలో పనిచేస్తున్న 4,500మంది ఉద్యోగులు, ఐటీకోర్సుల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి.స్టేట్‌స్ట్రీట్, పైకేర్‌, ఇన్వికాస్‌, వీఎఫ్‌ఎక్స్‌ తదితర కంపెనీలు స్టాళ్లు ఏర్పాటు చేస్తాయి. ఉద్యోగ అర్హతలు, పూర్తి చేయాల్సిన కోర్సులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. సంబంధిత కోర్సులు అందించే శిక్షణ సంస్థలు కూడా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి.దీని వలన  యువతకు నైపుణ్యాల పట్ల అవగాహన ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు.