blog single post
GENERAL NEWS

2019-03-15 10:57:16

ప్రపంచంలో ఏర్పడే మార్పులకు అనుగుణంగా విద్యావిధానాన్ని మార్పు చేయాలి:ఉపరాష్ట్రపతి వెంకయ్య

రాష్ట్రంలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో మాట్లాడారు.ప్రపంచంలో అతితక్కువ ఖర్చుతో వైద్యసేవలు అందిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.అమెరికాలో రూ.10వేలు ఖర్చయ్యే వైద్యానికి ఇక్కడ రూ.వెయ్యి సరిపోతాయన్నారు. అందుకే ఆఫ్రికా, ఇంగ్లాండ్‌, యూరప్‌ తదితర ప్రాంతాల నుండి వైద్యం కోసం మన దేశానికి వస్తున్నారన్నారు. ప్రపంచంలో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని, భారతీయ విద్యావిధానాన్ని మార్పు చేయాలని, పారిశ్రామిక రంగానికి విద్యను అనుసంధానించడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.విద్యార్థులు తాము నేర్చుకున్న సాంకేతికతను, గ్రామాభివృద్ధికి ఉపయోగించి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలన్నారు.ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులకు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను రూపొందించాలని వెంకయ్య సూచించారు.