blog single post
GENERAL NEWS

2019-03-15 10:48:45

ఓటరు నమోదుకు నేటితో ముగియనున్న గడువు!

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 3.90 కోట్లు దాటుతుందని భావిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.85 కోట్ల మంది ఓటర్లున్నారని, ఓటు హక్కు నమోదుకు వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా 5లక్షలు పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడు వచ్చే దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఓటర్ల సంఖ్య 3.90కోట్లు దాటే అవకాశం ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘‘ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఒక్క రోజే గడువు మిగిలింది. ఏప్రిల్‌ 11న ఎన్నికల్లో ఓటేయాలంటే జాబితాలో పేరు లేనివారు ఈరోజు సాయంత్రంలోగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.