blog single post
GENERAL NEWS

2019-02-11 02:48:55

10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల!

ఆంధ్ర ప్రదేశ్ లో పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ పరీక్షలకు 6.10 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకున్నారని వీరికోసం 2,833 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తామని గంటా చెప్పారు. పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లోపే ఫలితాలను విడుదల చేస్తామని ఆయనఈ సందర్భంగా తెలిపారు. పరీక్షకు హాజరు కావడానికి హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో పొందవచ్చని చెప్పారు. పరీక్షా సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.