blog single post
GENERAL NEWS

2019-02-11 01:13:13

విజయవాడలో సీఈసీ బృందం పర్యటన!

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా, ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసాతోపాటు, ఉన్నతాధికారుల బృందం ఈరోజు నుండి రెండు రోజుల పాటు విజయవాడలో పర్యటించనుంది. రానున్న పార్లమెంట్‌, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధతపై సమీక్షించనుంది. సీఈసీ రాష్ట్ర పర్యటన వివరాలను రాష్ట్ర ముఖ్య‌ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ పర్యటనలో భాగంగా వారు  రాజకీయ పార్టీల ప్రతినిధులతోమరియు నోడల్‌ అధికారులు, రాష్ట్ర పోలీసు, ఆదాయపన్ను, రవాణా, వాణిజ్యపన్నుల శాఖల అధికారులతోపాటు, రైల్వే, విమానాశ్రయ అధికారులతో కూడా సమావేశం అవుతారు.