blog single post
GENERAL NEWS

2019-02-11 12:37:07

సీఎం దీక్షకు సంఘీభావంగా తెలుగు దేశం పార్టీ శ్రేణులు!

విభజన హామీలను విస్మరించిన కేంద్ర ప్రబుత్వంపై పోరాటంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తెలుగుదేశం శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు. విజయవాడలోని మొగల్రాజపురంలో తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్షకు దిగారు. అలాగే దికృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ వద్ద అసోసియేష‌న్ హాల్లో మౌన దీక్ష చేపట్టారు.వివిధ ప్రాంతాల్లో కూడా ప్రజాప్రతినిధులు దీక్షకు సంఘీభావం ప్రకటిస్తూ మద్దతు తెలుపుతున్నారు.