blog single post
GENERAL NEWS

2019-01-12 04:48:06

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న పీసిసి చీఫ్ రఘువీరా రెడ్డి!

విభజన హామీల అమలు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో మోదీ విఫలమయ్యారని,వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా కావాలా? వద్దా? అనే విషయం ఆధారంగానే పోటీ ఉంటుంది’ అని పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. నిన్న అనంతపురం జిల్లా హిందూపురంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాహుల్‌గాంధీ ప్రధాని అయితే ప్రత్యేక హోదాపై తొలిసంతకం చేస్తారని, హామీ నెరవేర్చిన తర్వాతే రాష్ట్రంలోకి అడుగుపెడతారని అన్నారు.