blog single post
GENERAL NEWS

2019-01-12 04:28:04

భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చంద్రబాబు!

ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.50 ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువులో 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.చెరువు ప్రక్కనే  ఏడెకరాల స్థలంలో దాదాపు రూ.9కోట్ల వ్యయంతో పార్కును నిర్మించారు. పార్కు చుట్టూ జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని స్పీకర్ తెలిపారు.ఈనెల 18న స్వర్గీయ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా  విగ్రహావిష్కరణ జరుగనున్నట్లు చెప్పారు.