blog single post
GENERAL NEWS

2019-01-11 05:10:59

అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా:ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీమరోసారి స్పష్టం చేసారు. దుబాయ్‌పర్యటనలో ఉన్న రాహుల్‌ అక్కడ పని చేస్తున్న భారతీయ కార్మికులతో సమావేశమయ్యారు.స్థానిక లేబర్‌ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌పాల్గొని ప్రసంగించారు.అధికారంలోకి వచ్చిన మరుక్షణం కాంగ్రెస్ చేసే మొదటి పని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడమేనని తెలిపారు. దుబాయ్‌ అభివృద్ధిలో భారత కార్మికుల పాత్ర చాలా ఉందని కొనియాడారు.