blog single post
GENERAL NEWS

2019-01-11 04:28:48

కేంద్ర సహకారం ఉండుంటే మరింత అభివృద్ధి:ఏపీ సీఎం చంద్రబాబు

కేంద్రప్రభుత్వం  నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రూ. 75 వేల కోట్లు రావాల్సిఉందని   లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుతెలిపారు. ఈరోజు నెల్లూరు జువ్వెలదిన్నె జన్మభూమిలో పాల్గొన్నఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా ఫ్యాక్ట్‌ ఫైడింగ్‌ కమిటీ వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం సహకరించి ఉంటే ఇంకా అభివృద్ధి చెందేవాళ్లమని ఆయన  అన్నారు. రాష్ట్రంలో రైతులకు రూ. 24 వేల కోట్ల రుణమాఫీ చేశామని, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు.