blog single post
GENERAL NEWS

2019-01-11 03:49:06

ఎన్టీఆర్ చిత్రం పై చంద్రబాబు ప్రసంశలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు ఈరోజు ఉదయం ఉండవల్లిలో ‘ఎన్టీఆర్‌’ చిత్ర కథనాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడిని సత్కరించారు.ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ఎన్టీఆర్‌ పాత్రను అత్యద్భుతంగా నటించారని బాలకృష్టను ప్రశంసించారు.అంతేకాక ఎన్టీఆర్ జీవితాన్ని, త్యాగాన్ని, కార్యదక్షతను,క్రమశిక్షణను  ప్రజలకు అర్థమయ్యేలా చిత్ర రూపమిచ్చారంటూ దర్శకుడు క్రిష్‌ ప్రతిభను సీఎం చంద్రబాబు అభినందించారు.