blog single post
GENERAL NEWS

2019-01-11 11:08:06

ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ కొత్తబస్సులు..!

వేసవి కాలంలో భగభగ మండే ఎండలను  దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతనంగా  84 ఏసీ బస్సులను కొనుగోలు చేయాలని తలంచింది.ఈ బస్సుల్లో విజయవాడ రీజియన్‌ పరిధిలోని విజయవాడ-హైదరాబాద్‌, విజయవాడ-చెన్నై, విజయవాడ-బెంగళూరు మార్గంలో రెండు చొప్పున ఆరింటిని నడపనున్నారు. విశాఖ రీజియన్‌ పరిధిలోని విశాఖపట్నం-హైదరాబాద్‌ మార్గంలో రెండింటిని, తిరుపతి రీజియన్‌ పరిధిలోని తిరుపతి-హైదరాబాద్‌ మార్గంలో మరో రెండింటిని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు.