blog single post
GENERAL NEWS

2019-01-10 11:42:38

పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు!

సంక్రాంతి రద్దీ కారణంగా  31 జనసదరన్ ప్రత్యేక రైళ్లను నడిపనున్నట్లు  దక్షిణ మధ్య రైల్వే అధికారులుతెలిపారు. . సికింద్రాబాద్- తిరుపతి, తిరుపతి- కాకినాడ, విజయవాడ, విజయనగరం వరకు ఈ రైళ్లు పయనిస్తాయి. సికింద్రాబాద్- విజయవాడ, హైదరాబాద్- సికింద్రాబాద్, విజయవాడల మీదుగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి. ఈ రైళ్లలో అన్‌రిజర్వుడ్ కోచ్‌లుంటాయని, ప్రత్యేక రుసుములు చెల్లించకుండా సాధారణ టికెట్ల రేట్లతోనే ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నది. ఈ రైళ్లుఈ నెల 11వ తేదీ నుండి 19వ తేదీవరకు   సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.30 గంటలకు బయలుదేరి ఉదయం 3 గంటలకు విజయవాడకు చేరుకుంటాయి. నల్లగొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతాయి. విజయవాడ నుంచి తిరిగి సికింద్రాబాద్‌కు ఈనెల 12, 13, 14, 16, 17, 18, 19, 20 తేదీల్లో చేరుకుంటాయి.