blog single post
GENERAL NEWS

2019-01-10 11:34:37

భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు..!

ఈనెల 8, 9 తేదీల్లో ఉష్ణోగ్రతలు భారీగా  పడిపోయాయి. దీంతో మళ్లీ చలి గాలులు పెరిగాయి. గడచిన 24గంటల్లో విజయ వాడలో 15 డిగ్రీలు, విశాఖపట్నంలో 13 డిగ్రీలు, తిరుమలలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది 8వ తేదీ నుండి చలి తన పంజాను విసురుతోంది. బుధ, గురువారాల్లో భారీగా మంచు కురువడంతో చలి గాలులు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని, ఆపై నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించిందితెలిపింది.ఉత్తరాది నుండి వీస్తున్న శీతల గాలులు కూడా ఇబ్బందులు పెడుతున్నాయని,మరికొన్ని రోజులపాటు వృద్ధులు, చిన్నారులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.