blog single post
GENERAL NEWS

2019-01-10 11:14:01

ప్రజాసేవకు టిడిపి ప్రభుత్వమే నిదర్శనం:ఎంపీ కేశినేని

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులను జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని,ప్రజాసేవకు తెలుగు దేశం ప్రభుత్వమే నిదర్శనమని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.ఆటంకం లేకుండా  విద్యుత్తు సరఫరా చేస్తూ కోతలు లేకుండా చేశారని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్‌కు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అర్హత నూరు శాతం ఉందన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పరిశ్రమలు ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు.