blog single post
GENERAL NEWS

2019-01-09 03:21:11

ఫింటెక్ రంగం అభివృద్ధికి సహకరించనున్న సీఐఐ:మంత్రి లోకేష్

సీఐఐ చైర్మన్ సంజయ్‌తో ఆంధ్ర ప్రదేశ్ పంచాయితి రాజ్,ఐటీ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సీఐఐ, ఏపీ ఫింటెక్ వ్యాలీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో ఫింటెక్ రంగం అభివృద్ధికి సీఐఐ సహకారం అందించనున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ భూముల రికార్డులు డిజిటలైజ్ చేయడంతో పాటు బ్లాక్‌చైన్ టెక్నాలజీతో రక్షణ కల్పిస్తున్నామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలోఆంధ్ర ప్రదేశ్  నెంబర్ వన్‌లో ఉందనిగుర్తుచేశారు.అతి పెద్ద రెండు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏపీకి వచ్చాయని, ఐటీ రంగంలో అదాని గ్రూప్ పెట్టుబడి పెట్టనుందని మంత్రి లోకేష్ తెలిపారు.విభజన అనంతరం చంద్రబాబు కృషితో రాష్ట్రం అభివృద్ధి పధంలో సాగుతుందని ఆయన పేర్కొన్నారు.