blog single post
GENERAL NEWS

2019-01-09 11:10:27

ఈబీసీ బిల్లును స్వాగతిస్తున్నాం:ఏపీ సీఎం చంద్రబాబు

లోక్‌సభలో ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందడాన్ని చంద్రబాబు స్వాగతించారు. తెలుగుదేశం పార్టీ  ఆ బిల్లుకు మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో కేంద్రం పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానాలు, బిల్లు లు ఆమోదించి పంపామని గుర్తు చేశారు. కేంద్రం తనకు కావాల్సింది చేసుకుని రాష్ట్రాల సిఫార్సులను విస్మరిస్తోందని ఆరోపించారు. ఈబీసీ బిల్లును కేంద్రం ఒక రోజులో తెచ్చిందని, ఒకవేళ వారికి దీనిపై చిత్తశుద్ధి ఉంటే ముందే తీసుకొచ్చి అందరితో సంప్రదించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేసారు.