blog single post
GENERAL NEWS

2018-12-06 04:00:11

రాందేవ్ బాబా సంస్థకి 172.84 ఎకరాల భూమిని కేటాయించిన ఏపి ప్రభుత్వం

వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలోని  చిన్నరావు పల్లిలో బాబా రాందేవ్ కి చెందిన పతంజలి సంస్థ ఏర్పాటు చేసే మెగా పుడ్‌ పార్క్‌ గురించి సీఎం చంద్రబాబుకు రాందేవ్‌ బాబా తెలిపారు.అయితే  రూ.634 కోట్లతో ఆహార శుద్ధితో పాటు అనుబంధ యూనిట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయనా చెప్పారు.అయితే దాదాపు 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని రాందేవ్ బాబా పేర్కొన్నారు. దీనితో ఈ మెగా ఫుడ్ పార్క్ కు ప్రభుత్వం 172.84 ఎకరాలు భూమిని కేటాయించింది.