blog single post
GENERAL NEWS

2018-12-06 03:50:51

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త …. !

ఏపీలో నిరుద్యోగ భృతి పొందుతున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది.ఏపీలోని నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విలేకర్లతో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడతూ…  సీఎం యువ నేస్తం పధకం కింద 4 లక్షలకు పైగా అర్హులకు ప్రతీ నెల రూ.1000 భృతి ఇస్తున్నారు అని మంత్రి చెప్పారు.అయితే ఈ పథకానికి 10 లక్షల 74 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అని మంత్రి తెలిపారు.నిరుద్యోగ భృతి తీసుకుంటున్న వారికి ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాం అని చెప్పారు.ఈ నెల 10నుండి  555 కేంద్రాల్లో సిల్క్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తామని చెప్పారు.దీని కోసం ప్రభుత్వం రూ.24 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ శిక్షణ కోసం నిరుద్యోగులు ముఖ్యమంత్రి యువనేస్తం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.నిరుద్యోగులకు ఇష్టం ఉన్న వాటిలోనే కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి తెలిపారు.