blog single post
GENERAL NEWS

2018-12-06 10:44:32

నేడు సీఎం తిరుపతి పర్యటన .. !

ఏపి సిఎం చంద్రబాబు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. అయితే ఈరోజు తిరుపతి లో జరిగే పేదరికం పై గెలుపు సభలో సీఎం పాల్గొననున్నారు. ఆదరణ పథకం-2 పథకం  ద్వారా లబ్దిదారులకు పనిముట్లను పంపిణీ చేయనున్నారు. అలాగే తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర ఉద్యానవనం పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.