blog single post
GENERAL NEWS

2018-12-06 10:42:53

నేడు కోటి దీపోత్సవం…ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబు

ఈరోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో కోటి దీపోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.  ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు. దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా పూజా సామగ్రి అందజేయనున్నారు. కోటి దీపోత్సవం సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలతో ప్రవచనాలు చేయించనున్నారు.