blog single post
GENERAL NEWS

2018-11-08 07:32:32

ఈనెల 12నుంచి జగన్ యాత్ర పునఃప్రారంభం

వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ తన ప్రజాసంకల్పయాత్రను ఈ నెల 12నుంచి పున:ప్రారంభించనున్నారు. కొద్దిరోజుల కిందట విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌పై దాడి జరిగిన తరువాత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రజాసంకల్ప యాత్రకు కొద్దిరోజులు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఆదివారం సాయంత్రం జగన్‌ విశాఖకు బయలుదేరనున్నారు.
జ‌గ‌న్‌పై దాడి కేసు రేపటికి వాయిదా
వైఎస్ జగన్‌పై హ‌త్యాయత్నం కేసు విచారణ హైకోర్ట్ రేపటికి వాయిదా పడింది. ఈమేర‌కు ఈ కేసు వివరాలను రేపు  కోర్ట్ ముందు ఉంచాలని ఏపి అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. కాగా హత్యాయత్నం కేసును హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరపాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అన్న విషయంను రేపు నిర్ణయిస్తామని తెలిపింది. 
అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను తమముందు ఉంచాలని ఏపి అడ్వొకేట్ జనరల్ ను కోర్ట్ ఆదేశించింది. కేసును తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ వ్యవహరించారని జగన్ తరఫు న్యాయవాది ఆరోపించారు. మరోవైపు ఈ ఆరోపణలను ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ ఖండించారు. పోలీసుల విచారణకు జగన్ సహకరించడం లేదని, పోలీసులకు సహకరించాల్సిందిగా పిటిషనర్ ను ఆదేశించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.