blog single post
GENERAL NEWS

2018-11-07 09:10:17

ఇక విశాఖలో ఉత్సవ సందడి షురూ

విశాఖ జిల్లాలో ఉత్సవ్‌ సందడి వచ్చేసింది. ఏటా జరిగే విశాఖ ఉత్సవ్‌, అరకు బెలూన్‌ ఉత్సవ్‌, యాచ్‌ ఫెస్టి వల్‌ను ఈసారికూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గత ఏడాదితో పోల్చుతే.. ఈసారి మరింత పర్యాటకలు తాకిడి పెరగడంతో పాటు ఈ ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందిం చింది. ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వ హించేందుకు రూ.11.5 కోట్లను ప్రభుత్వం వెచ్చించనున్నట్టు వివరించారు. వచ్చే నెల 28, 29, 30 తేదీల్లో విశాఖ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.