blog single post
National

2018-11-08 07:52:52

పెద్దనోట్ల రద్దు గాయాలు ఇంకా మానలేదు : మాజీ ప్రధానిమన్మోహన్‌సింగ్‌

ఈరోజు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌....పెద్ద నోట్ల రద్దు జరిగి రెండేళ్లు గడిచిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... 2016 నాటి గాయాలు ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయని,..నోట్ల రద్దు పరిణామాలు ఇప్పటికీ విచ్ఛిన్నకరంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్త నిరసనలను కాంగ్రెస్‌ చేపడుతోంది. ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసిన ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది. ఆర్థిక విధానాల్లో నిశ్చలత్వం, దృగ్గోచరత పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని, దీర్ఘకాలంగా ఆర్థిక దుర్వినియోగం ఎలా జరిగిందో, ఆర్ధిక విధానాలను జాగ్రత్తతో ఎలా నిర్వహించాలో అర్థం చేసుకునేందుకు ఈ రోజుంటూ ఒకటి గుర్తుండిపోతుందని అన్నారు. మధ్య, చిన్న తరహా వ్యాపారులు ఇంకా కోలుకోలేదని, యువత, ఆర్థిక మార్కెట్‌, మౌలిక సదుపాయాల రుణదాతలు, బ్యాంకేతర సంస్థలపై ప్రభావం చూపించందని అన్నారు. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నోట్ల రద్దుకు మద్దతునిస్తూ తన ట్విట్టర్ ఖాతా‌లో పలు అంశాలను ప్రస్తావించారు.