blog single post
National

2019-04-15 03:58:51

గోదావరి- కావేరి నదుల అనుసంధానం:కేంద్ర మంత్రి గడ్కరీ

తమిళనాడులోని సేలంలో నిన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గోదావరి- కావేరి నదులను రూ.60వేల కోట్ల వ్యయంతో అనుసంధానించనున్నట్లు తెలిపారు.గోదావరి నుండి 1,100 టీఎంసీల నీరు వృథా అవుతోందని, దీంతో గోదావరి- కృష్ణా జలాల అనుసంధానం చేపట్టామని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి పళనిస్వామి కృషితో రూ.60వేల కోట్ల వ్యయంతో గోదావరి- కావేరి నదుల అనుసంధానాన్ని ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.  నీరు ఎంత ముఖ్యమో తనకు బాగా తెలుసని,10వేల మంది రైతులు బలవన్మరణానికి పాల్పడిన మహారాష్ట్రలోని విదర్భ నుండి తాను వచ్చానని ఈసందర్భంగా గడ్కరీ వ్యాఖ్యానించారు.