blog single post
National

2019-04-15 02:58:42

ఎన్డీయేకి అలాంటి ఉద్దేశమే లేదు:రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్

మోడీ, అమిత్‌ షా సాయుధ దళాల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుని, ఓట్లుగా మార్చుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌  స్పందించారు. ప్రధాని మోడీకిగానీ, ఎన్డీయేకిగానీ అలాంటి ఉద్దేశమేదీ లేదని ఆమె స్పష్టం చేశారు. పుల్వామా ఘటన జరిగిన తరువాత భారతీయుల గుండెలు మండాయని, మేము ఎన్నుకున్న ప్రభుత్వానికి అంతకంతా బదులు చెప్పే సత్తా లేదా అన్న ఆగ్రహం వారినుండి వ్యక్తమైందని చెప్పారు. ఇంటెలిజెన్స్‌ నివేదికల ఆధారంగా సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎదురు దాడులకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు.