blog single post
National

2019-03-15 12:38:02

ఎన్‌ఎస్‌జీలోకి భారత్‌ త్వరగా ప్రవేశించాలని ఆకాంక్షించిన అమెరికా!

ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వం కోసం మద్దతు ఇస్తున్నట్లు అమెరికా తెలిపింది. భారత్‌తో ద్వైపాక్షిక భద్రత, పౌర అణు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఆరు అణు విద్యుత్‌ కర్మాగారాలను నిర్మించడానికి అమెరికా అంగీకారించింది.భారత్‌-అమెరికా వ్యూహాత్మక భద్రతా వ్యవస్థ 9వ విడత చర్చల తరువాత రెండు దేశాలు ఈ సంయుక్త ప్రకటన వెలువడింది. ఈ చర్చలకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే, అమెరికా ఆయుధ నియంత్రణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల శాఖ కార్యదర్శి ఆండ్రియా థాంప్సన్‌లు అధ్యక్షత వహించారు. పౌర అణు ఇంధన రంగంలో సహకారం కోసం రెండు దేశాలు 2008 అక్టోబర్‌లో ఒక చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎన్‌ఎస్‌జీలోకి భారత్‌ త్వరగా ప్రవేశించాలన్న ఆకాంక్షను అమెరికా మరోసారి పునరుద్ఘాటించింది. ఇందుకు తన మద్దతు ఉంటుందని తెలిపింది. అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ కూటమిలో భారత చేరికను చైనా అడ్డుకుంటోంది. అంతరిక్ష రంగంలో పొంచి ఉన్న ముప్పులపై కూడా రెండు దేశాలు దృష్టిసారించాయి.