blog single post
National

2019-03-15 12:12:31

కాంగ్రెస్ కు గుడ్ బాయ్:టామ్‌ వడక్కన్‌

కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడైన పార్టీ అధికార ప్రతినిధి టామ్‌ వడక్కన్‌ నిన్న కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిశారు. గత రెండు దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్‌కు సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా వడక్కన్‌ మాట్లాడుతూ ఇటీవల  బాలాకోట్‌ లోని ఉగ్రవాదులపై వైమానిక దాడుల పట్ల కాంగ్రెస్‌ అనుసరించిన వైఖరి తనను ఎంతో బాధించిందని, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీని వీడానని పేర్కొన్నారు. ఆయన బీజేపీ తరపున కేరళ రాష్ట్రం నుండి లోక్‌సభకు పోటీ చేయనున్నారు.