blog single post
National

2019-03-15 11:41:03

మంచుతుఫాన్ తో వణికిపోతున్న అమెరికా!

అమెరికా మంచు తుఫానుతో  వణికిపోతుంది. రాకీ పర్వతాల నుండి  భారీగా వీస్తున్న చల్లని గాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. 148 కిలో మీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలుల వల్ల కొలరాడో, నెబ్రస్కా, డకోటాలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అనేక ప్రాంతాల్లో కొన్ని లక్షల కుటుంబాలు అంధకారంలో ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుఫానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుఫానును బాంబ్‌ తుఫానుగా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండడంతో అధికారవర్గాలు  అప్రమత్తమవుతున్నాయి.